బెంగాల్ లోని దిఘా సముద్రతీరం వద్ద మత్స్యకారులకు 780 కిలోల భారీ చేప చిక్కింది. దీనిని స్థానికంగా శంకర్ చేప అంటారని.. అదృష్టం కొద్దీ తమకు దొరికిందని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. బెంగాల్ తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని దిఘా సముద్రతీరంలో… జాలారుల వలకు 780 కిలోల భారీ చేప చిక్కింది. దీనిని స్థానికంగా ‘శంకర్ చేప’ అంటారని మత్స్యకారులు తెలిపారు. సోమవారం ఉదయం కొంత మంది జాలారులు కలిసి సముద్రంలోకి వేటకు వెళ్లగా… ఈ భారీ చేప చిక్కింది. దీనిని చూడడానికి స్థానిక ప్రజలు గుంపులుగా సముద్రతీరానికి చేరుకోవటంతో అక్కడ అంతా కోలాహలం చోటుచేసుకుంది.
ఈ విధంగా తీరానికి ఎంతమంది జాలర్లు అధిక మొత్తంలో బరువున్న చేపలతో తిరిగి వస్తూ ఉంటారు. ఈ మధ్య కొన్ని రోజుల క్రితం కాకినాడ తీరానికి 300 కిలోల పైగా ఉన్న వింత చేప జాలర్ల వలలో పడి తీరానికి చేరుకుంది. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు జాలర్లు వలలో బంగారం పడినట్లు అవుతుంది.