శాంసంగ్ సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎం01 కోర్‌ను భారత్‌లో సోమవారం విడుదల చేసింది. ఇందులో గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. ఇండోనేషియా మార్కెట్‌లో గత వారం కిందటే ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ప్రస్తుతం భారత్‌లోనూ ఈ ఫోన్ విడుదలైంది. ఇందులో 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ ఎం01 కోర్ స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 1జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.5,499 ధరకు విక్రయిస్తున్నారు. 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.6,499 ధరకు విక్రయిస్తున్నారు. బ్లాక్, బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ విడుదలైంది. దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శాంసంగ్ రిటెయిల్ స్టోర్స్‌తోపాటు శాంసంగ్ ఇ-స్టోర్స్‌లోనూ జూలై 29 నుంచి విక్రయిస్తారు.
ఇక ఈ ఫోన్‌లో 5.3 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఇతర ఫీచర్లను కూడా ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.