దీపావళి నాటికి ఉద్యోగులకి బంపర్ ఆఫర్…!

-

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్రం ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ ని పెంచేందుకు నిర్ణయించింది. పూర్తి వివరాల లోకి వెళితే.. డియర్‌నెస్ అలవెన్స్ ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది ఉద్యోగులకి రిలీఫ్ ని ఇవ్వనుంది. ప్రభుత్వం డీఏను 4 శాతం మేర పెంచింది. దీనితో అలవెన్స్ 38 శాతానికి వెళ్ళింది. ఇదే కాకుండా మరో గుడ్ న్యూస్ ని కూడా అందించింది.

హౌస్ రెంట్ అలవెన్స్ ని కూడా కేంద్రం త్వరలోనే పెంచనుంది. దీనితో సాలరీ కూడా పెరగనుంది. డియర్‌నెస్ అలవెన్స్ ని పెంచినట్టే హెచ్‌ఆర్ఏను కూడా పెంచెలనే కనపడుతోంది. అయితే ఈ నిర్ణయాన్ని కేంద్రం ఎప్పుడైనా తీసుకోవచ్చు. దీపావళికి ముందే ఈ నిర్ణయం తీసుకోవచ్చట. గతంలో చూస్తే.. 2021లో హెచ్ఆర్ఏ ని కేంద్రం పెంచింది.

అప్పుడే డీఏ కూడా 28 శాతానికి చేరింది. ఇప్పుడైతే 34 శాతం నుంచి 38 శాతానికి ఇది వెళ్ళింది. అయితే వీటికి పలు రూల్స్ ఉంటాయి. డియర్‌నెస్ అలవెన్స్ అనేది 25 శాతానికి వెళితే అప్పుడు హౌస్ రెంట్ అలవెన్స్‌ను కూడా మారుస్తారు.

7వ వేతన సంఘం బట్టి చూస్తే.. ఎక్స్ కేటగిరిలోని పట్టణాల్లో వుండేవాళ్ళకి హెచ్ఆర్ఏ 27 శాతంగా ఉండాలట. వై కేటగిరిలోని పట్టణాల్లోని ఉంటే 18 శాతంగా ఉండాలట. జెడ్ కేటగిరిలోని పట్టణాల్లో ఉంటే 9 శాతంగా ఉండాలట. ఇప్పుడు 4 నుంచి 5 శాతం ఎక్స్ కేటగిరిలోని వారికీ, 2 శాతం పెంపు వై వాళ్ళకి, ఒక శాతం జెడ్ వారికి ఉండనుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version