VVS LAXMAN : భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కి భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక బాధ్యతలు అప్పగించబోతోంది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్, టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టడంతో అతని స్థానంలో వివిఎస్ లక్ష్మణ్ ని బిసిసిఐ నియమించబోతోంది.
ఈ మేరకు ఇప్పటికే చర్చలు జరిపిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అతడిని ఒప్పించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ నియామకానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. వాస్తవానికి ఎన్సిఏ హెడ్ గా ఉండేందుకు తోలుతా వివిఎస్ లక్ష్మణ్ నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. హెడ్ గా ఉంటే ఏడాదిలో కనీసం 200 రోజులు బెంగుళూరు లోనే అతను ఉండాల్సి ఉంటుంది.