గోవాలో కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి 8 మంది ఎమ్మెల్యేలు

-

ఒక్కొక్కటిగా రాష్ట్రాలపై పట్టుసాధించడానికి బీజేపీ పావులు కదుపుతోంది. ఇటీవల మహారాష్ట్రను తన గుప్పిట్లో పెట్టుకున్న కమలదళం తర్వాత బిహార్‌పై కన్నేశాయి. కానీ నితీశ్ కుమార్ ముందే పసిగట్టి బీజేపీ ప్లాన్‌ను గట్టిగా తిప్పికొట్టారు. ఇప్పుడు రూట్ మార్చిన కాషాయదళం గోవాను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఎనిమింది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి రెడీ అయింది.

గోవాలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్​కు 11 మంది సభ్యులు ఉండగా.. అందులో 8 మంది బీజేపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తమతో కలిసేందుకు వీరంతా ముందుకొచ్చారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సదానంద్ శేఠ్ వెల్లడించారు. ఎమ్మెల్యేలు దిగంబర్ కామత్, మైఖేల్ లోబో, డెలిలా లోబో, రాజేశ్ ఫాల్దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ ఆమోంకర్, అలిక్సో సిక్వేరా, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్‌లో కమలతీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు.

గోవా అసెంబ్లీలో మొత్తం 40 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో బీజేపీకు 20 మంది, కాంగ్రెస్​కు 11 మంది సభ్యులు ఉన్నారు. 2019 జులైలోనూ 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఇవాళే ఈ కాంగ్రెస్ నేతలంతా తమ పార్టీకి హ్యాండ్ ఇచ్చి కాషాయ తీర్థం పుచ్చుకుని కమలదళంలో చేరనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version