ఎఫ్‌సీఐలో ఐదు, ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో 860 ఉద్యోగాలు…!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోచ్చు. ఐదు, ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో 860 వాచ్‌మెన్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

jobs

ఆన్ లైన్ పద్దతిలో ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 10, 2021 ఆఖరి తేదీ. ఇది ఇలా ఉంటే పోస్టులకు ఎంపికైన అభ్య‌ర్థికి నెల‌కు రూ.23,000 నుంచి రూ. 64,000 జీతం చెల్లిస్తారు. అలానే ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థికి రాత ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ప‌రీక్ష ఇంగ్లీష్‌, హిందీ, పంజాబీలో నిర్వ‌హిస్తారు. ప‌రీక్ష‌లో ఎటువంటి నెగెటీవ్ మార్కింగ్ లేదు. రాత ప‌రీక్ష 120 మార్కుల మ‌ల్టిపుల్ చాయిస్ ప్ర‌శ్న‌లు ఉంటాయి.

మెరిట్ ద్వారా ఎంపికైన వారిని పోస్టులోకి తీసుకొంటారు. ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారు అప్లికేష‌న్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://fci.gov.in/ లేదా https://www.recruitmentfci.in/ వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలని అనుకునే వారు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.recruitmentfci.in/ ను సంద‌ర్శించాలి. ఆ తరవాత వెబ్‌సైట్‌ల Category IV Recruitment లింక్‌ లోకి వెళ్లాలి. అక్కడ నోటిఫికేషన్ లో వివరాలని చూడచ్చు.

నోటిఫికేషన్ లింక్: https://documents.fci-punjab-watch-ward.in/notification

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే విజ‌య‌ప‌థం.కామ్ వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version