కరోనా మహమ్మారి ఏ రంగాన్ని వదలడం లేదు. జర్నలిస్టులు బలైపోయారు, పోలీసులు మరణించారు, రైల్వే అధికారులు మరణిస్తున్నారు. ప్రజలకోసం ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడుతుంటే కరోనా మహమ్మారి వారిపైనే కాటు వేస్తుంది. కనికరం లేకుండా బుసలు కొడతుంది. దేశవ్యాప్తంగా పలు జోన్ లలో పని చేస్తున్న రైల్వే ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. కేవలం సెంట్రల్, వెస్టర్న్ రైల్వే కు చెందిన ఉద్యోగులే దాదాపుగా 872 మంది కరోనా బారిన పడ్డారు.
వారిలో రిటర్డ్ ఉద్యోగులు ప్రస్తుత ఉద్యోగులు ఉద్యోగుల కుటుంబాలా వారు అందరూ ఉన్నారు. తాజాగా వారికి వైద్యం అందించేందుకు నియమించిన బాబు జగ్జీవన్ రామ్ ఆసుపత్రి బాధితులతో నిండిపోయింది. అత్యధికంగా సెంట్రల్ రైల్వే శాఖలో 559 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు మొత్తంగా 86 మంది మరణించారని అందులో 22 మంది కుటుంబసభ్యులు, రిటైర్డ్ ఉద్యోగులు అని పేర్కొంది భారత రైల్వే శాఖ.