8వ తరగతి చదివే ఆ బాలుడు.. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించే నూతన పరికరాన్ని తయారు చేశాడు..!

-

ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల చెరువులు, నదులు, సముద్రాల్లో ఉండే ప్రాణులకు, పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని కొంత వరకైనా నివారించేందుకు గాను ఆయా ప్రాంతాల్లో పేరుకుపోయే ప్లాస్టిక్‌ను తొలగించడానికి మకర అనే ఓ వినూత్నమైన పరికరాన్ని అత‌ను తయారు చేశాడు.

చెరువులు, నదులు, సముద్రాలు ప్లాస్టిక్ వ్యర్థాలతో కలుషితమవుతుండడం వల్ల పర్యావరణానికి ఎంత నష్టం కలుగుతుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నీటిలో నివసంచే ప్రాణులకు హాని కలుగుతోంది. దీంతో జీవ వైవిధ్యం దెబ్బ తింటోంది. సముద్రాల్లో అరుదైన జాతికి చెందిన జీవులు కనుమరుగవుతున్నాయి. ఈ క్రమంలోనే జరుగుతున్న నష్టాలను గమనించిన ఆ బాలుడు ఎలాగైనా సరే ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు నడుం బిగించాడు. అందులో భాగంగానే సొంతంగా ఓ పరికరాన్ని తయారు చేశాడు.

అతని పేరు వరుణ్ సైకియా. గుజరాత్‌లోని వడోదరలో ఉన్న నవ్రచన అనే స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల చెరువులు, నదులు, సముద్రాల్లో ఉండే ప్రాణులకు, పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని కొంత వరకైనా నివారించేందుకు గాను ఆయా ప్రాంతాల్లో పేరుకుపోయే ప్లాస్టిక్‌ను తొలగించడానికి మకర అనే ఓ వినూత్నమైన పరికరాన్ని తయారు చేశాడు. ఆ పరికరం మోటార్ల సహాయంతో నడుస్తుంది. రిమోట్‌తో ఆపరేట్ చేయవచ్చు. ఈ క్రమంలోనే చిన్నపాటి కొలనుల్లో నీటిపై తేలియాడే ప్లాస్టిక్ వ్యర్థాలను ఈ పరికరం సహాయంతో సులభంగా తొలగించవచ్చు. ఇక 3 కేజీల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలను ఈ పరికరం సేకరిస్తుంది.

అయితే ప్రస్తుతానికి మకర పరికరాన్ని వరుణ్ చిన్నపాటి కొలనుల్లో వాడేందుకే తయారు చేసినా.. ఎవరైనా ఆర్థిక సహకారం అందిస్తే మరింత పెద్ద మోటార్లతో పెద్ద సైజులో ఈ పరికరాన్ని తయారు చేసి పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వ్యర్థాలను ఏకంగా సముద్రాల నుంచే సేకరించవచ్చని వరుణ్ చెబుతున్నాడు. ఈ క్రమంలో వరుణ్ తన లక్ష్యసాధన ప్రయాణంలో విజయం చెందాలని మనమూ కోరుకుందాం..!

Read more RELATED
Recommended to you

Exit mobile version