ప్రమాదంలో చిక్కుకున్న 9 మంది మిస్సింగ్ ?

-

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో భారీ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. షాట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు 17 మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా 8 మంది సొరంగం నుంచి బయటకు పరుగులు తీశారు. మిగిలిన 9 మంది ఉద్యోగులు లోపలే చిక్కుకున్నారు. వీరిలో 7 గురు జెన్ కో ఉద్యోగులు కాగా ఇద్దరు అమ్రాన్ కంపెనీ సిబ్బంది ఉన్నారు.

ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లి బయటకు వచ్చేశారు. మంటలు, పొగలు అదుపులోకి వచ్చాయని, ప్రమాదం జరిగిన స్పాట్ వరకు ఈజీగా వెళ్లగలుగుతున్నామని చెబుతున్నారు. రాత్రి నుంచి దట్టమైన పొగల కారణంగా లోపలికి వెళ్లలేకపోయామని అంటున్నారు. అయితే తొమ్మిది మంది క్షేమంగా ఉన్నారా లేదా ఇప్పుడే చెప్పలేమని ఎందుకంటే ప్రమాదం జరిగిన చోటు నుండి చాలా దూరం వెళ్లి వెతికామని, ఎవరు కనపడలేదు సరికదా వారి నుండి ఎటువంటి శబ్దాలు కూడా వినపడలేదని అన్నారు. దీంతో లోపల ఉన్న వారు ఏమయ్యారో అనే ఆందోళన అందరిలోనూ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news