ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సన్ రైజర్స్ జట్టు ఆటగాళ్లకు పెనుప్రమాదం తప్పింది. వారు బస చేస్తున్న జూబ్లీహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆ హోటల్‌లోనే ఆటగాళ్లు ఉన్నట్లు సమాచారం.
హోటల్ మొదటి అంతస్తులో పొగలు రావడంతో సిబ్బంది, అతిథులు భయాందోళనకు గురయ్యారు. ఆ టైంలో హోటల్ 6వ అంతస్తులో సన్ రైజర్స్ ఆటగాళ్లు ఉన్నట్లు సమాచారం. దీంతో వెంటనే వారిని హోటల్‌ను ఖాళీ చేయించి SRH టీమ్ బస్సులో వేరే చోటుకు తరలించింది. అగ్నిప్రమాద సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పార్క్ హయత్ అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డ SRH ప్లేయర్స్
అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో హోటల్ లో బస చేస్తున్న ఆటగాళ్లు.
హోటల్ మొదటి అంతస్తులో పొగలు రావడంతో భయాందోళనకు గురైన సిబ్బంది, అతిథులు.
ప్రమాద సమయంలో 6వ అంతస్తులో ఉన్న సన్ రైజర్స్ ఆటగాళ్లు.
వెంటనే హోటల్ ను ఖాళీ చేసి… https://t.co/N0LGva5pVn pic.twitter.com/gJM0dNtQ7q— ChotaNews App (@ChotaNewsApp) April 14, 2025