టీ మంత్రి రాస‌లీల‌ల వెన‌క బిగ్‌ పొలిటిక‌ల్ స్కెచ్‌…!

-

తెలంగాణ‌లో ఓ మంత్రి రాస‌లీల‌ల వ్య‌వ‌హారం అంటూ కొన్ని మీడియా సంస్థ‌ల‌తో పాటు సోష‌ల్ మీడియాలో ఒక్కటే వార్త‌లు పుంఖాను పుంకాలుగా వైర‌ల్ అవుతున్నాయి. ఆ మంత్రి రెండు మూడు సినిమాల్లో న‌టించిన ఓ యువ‌తిపై మోజు ప‌డి ఆమెతో కోరిక తీర్చుకునేందుకు త‌న సన్నిహితురాలిని పుర‌మాయించార‌ని.. ఆమె స‌ద‌రు సినిమా యువ‌తితో మంత్రి ముచ్చట తీర్చాల‌ని చాటింగ్ చేసిందంటూ కొన్ని వాట్సాప్ మెసేజ్‌లు వైర‌ల్ అయ్యాయి. వీటిని స‌ద‌రు ఛానెల్‌తో పాటు సోష‌ల్ మీడియాలో మంత్రి రాస‌లీల‌లు అంటూ ఒక్క‌టే వార్త‌లు వ‌స్తున్నాయి.

స్వ‌యంగా మంత్రిపై ఆరోప‌ణ‌లు రావ‌డంతో ముందు టీఆర్ఎస్ శ్రేణుల్లో ఎక్క‌డా లేని అయోమ‌యం నెల‌కొంది. ఆ త‌ర్వాత ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు సైతం స్వ‌యంగా రంగంలోకి దిగి స‌మాచారం సేక‌రిస్తున్నాయ‌న్న వార్త‌లు కూడా వ‌చ్చాయి. చివ‌ర‌కు స‌ద‌రు మంత్రి ఇంట్లో ఈ విష‌యం తెలియ‌డంతో వారు కూడా మంత్రికి చీవాట్లు పెట్టార‌న్న వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే స‌ద‌రు బీసీ మంత్రి టార్గెట్ వెన‌క తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో మ‌రో ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.

స‌ద‌రు మంత్రి టార్గెట్ వెన‌క ఆయ‌న్ను త‌ప్పించే ప్ర‌య‌త్నం ఉంద‌ని.. ఇటీవ‌లే కేసీఆర్ కుమార్తె క‌విత ఎమ్మెల్సీ అయ్యారు. ఆమెను మంత్రిని చేయాలంటే మంత్రి వ‌ర్గంలో ఎవ‌రో ఒక‌రిని త‌ప్పించాలి. ప్ర‌స్తుతం అధికార పార్టీలో ఇద్ద‌రు మ‌హిళా మంత్రులు ఉన్నారు. వారికే ఆల‌స్యంగా కేబినెట్ బెర్తులు ఇచ్చారు. వారిని త‌ప్పించే ఛాన్సులు లేవు. ఈ క్ర‌మంలోనే క‌విత ఎమ్మెల్సీ కోస‌మే స‌ద‌రు బీసీ మంత్రిని టార్గెట్ చేశార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. రాస‌లీల‌ల ఆరోప‌ణ‌లు కావ‌డంతో ఆ మంత్రిని త‌ప్పించేందుకు ప‌క్కా స్కెచ్‌తోనే ఇలా ఇరికించార‌ని అంటున్నారు.

బీసీ మంత్రిని త‌ప్పించి కేసీఆర్ త‌న కుమార్తెకే మంత్రి ప‌ద‌వి ఇస్తే చాలా విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని కూడా కొంద‌రు అంటున్నారు. ఇప్ప‌టికే కేబినెట్లో వెల‌మ వ‌ర్గం నుంచి కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉండ‌గా, కేటీఆర్‌, హ‌రీష్‌రావు, ద‌యాక‌ర్‌రావు మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు అదే వ‌ర్గం నుంచి క‌విత‌కు ఎలా ?  మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని మ‌రి కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఏదేమైనా బీసీ మంత్రిని టార్గెట్ చేసిన ఛానెల్ ప్ర‌భుత్వ అధికారిక ఛానెల్‌… ఆ ఛానెల్లోనూ ఈ వార్త‌లు రావ‌డంతో స‌ద‌రు మంత్రి టార్గెట్ వెన‌క అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version