కోల్కతా నైట్ రైడర్స్ కి భారీ షాక్…. తప్పుకున్న ఇంగ్లాండ్ ఓపెనర్

-

మరికొన్ని రోజుల్లోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో కోల్కత్తా నైట్ రైడర్స్ కి ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్ భారీ షాక్ ఇచ్చాడు.వ్యక్తిగత కారణాల వల్ల IPL 2024 నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు.దీంతో కోల్కత్తా మేనేజ్మెంట్ అతని స్థానాన్ని మరో ఇంగ్లాండ్ ఓపెనర్‌తో భర్తీ చేసింది.జేసన్ రాయ్ స్థానంలో ఫిల్ సాల్ట్ను రిప్లేస్ చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించింది. జేసన్ రాయ్ సాల్ట్ గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉండగా వేలంలో అమ్ముడుపోలేదు. అయితే అతని రిజర్వ్ ధర రూ.1.5 కోట్లు చెల్లించి కోల్కతా నైట్ రైడర్స్ తీసుకుంది.

ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్ ఇలా వైదొలగడం ఇదే మొదటిసారి కాదు. 2020 సీజన్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ కు కూడా ఇలానే షాకిచ్చాడు. అనంతరం 2022లో గుజరాత్ టైటాన్స్ నుండి నిరవధిక విరామం తీసుకున్నాడు. గతేడాది సాల్ట్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 9 మ్యాచ్‌ల్లో 163.91 స్ట్రైక్ రేట్ తో 218 రన్స్ చేశాడు. అయితే, అనూహ్యంగా అతడు ఐపీఎల్ వేలంలో ఎవరు కొనుగోలు చేయలేదు. కనీస ధరకు కొనుగోలు చేసేందుకు కూడా ఫ్రాంచైజీలు చూపకపోవడం అతని రిజర్వ్ వేలం ధర రూ. 1.5 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news