తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామ్యూల్‌కు చేదు అనుభవం ఎదురైంది. తమను పట్టించుకోవడం లేదని, ప్రయారిటీ ఇవ్వడం లేదని ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే మీద తిరగబడినట్లు తెలిసింది. గతంలో వేరే పార్టీలో ఉన్న సామ్యూల్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తమకు ప్రాధాన్యత ఇవ్వవా? అంటూ ఓ కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే మందుల సామ్యూల్‌ను ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉరికించినట్లు సమాచారం. మందుల సామ్యూల్, రేవంత్ రెడ్డి ఉన్న బ్యానర్లను కాంగ్రెస్ కార్యకర్తలు పీకి పారేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఎమ్మెల్యే మందుల సామ్యూల్‌ను ఉరికించిన ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు
కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తమకు ప్రాధాన్యత ఇవ్వవా అంటూ ఓ కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే మందుల సామ్యూల్‌ను ఉరికించిన ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు
మందుల సామ్యూల్, రేవంత్ రెడ్డి ఉన్న బ్యానర్లను పీకి పారేసిన… pic.twitter.com/0FN77Pr0Oj
— Telugu Scribe (@TeluguScribe) February 22, 2025