TS24 మహిళా జర్నలిస్టులపై పోలీసుల ఓవరాక్షన్ :మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్

-

TS24 కార్యాలయంపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళా జర్నలిస్టుపై అనుచితంగా ప్రవర్తించిన ఘటన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉందన్నారు.మీడియా స్వేచ్ఛను అణగదొక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తోంది. అధికార బలంతో పోలీసులను మీడియాపై ఉసిగొల్పడం గర్హనీయమైన చర్య.

మహిళా జర్నలిస్టుపై అక్కసుతో పోలీసులు ఓవర్ యాక్షన్ చేయడం, సీసీ కెమెరా డేటాను స్వాధీనం చేసుకోవడం మీడియా స్వేచ్ఛను కాలరాయడమే అని అన్నారు.ఇది @revanth_anumula నిరంకుశ, నియంతృత్వ పాలనలో జర్నలిస్టులకు దక్కుతున్న గౌరవం ఇది అని తెలిపారు. 14 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు, పోస్టులు పెడితే భౌతిక దాడులు! ఇదేనా మీరు చెప్పిన సో కాల్డ్ ప్రజాపాలన? ఇందిరమ్మ రాజ్యమని కాంగ్రెస్ ఎమర్జెన్సీ పాలనను గుర్తుచేస్తున్నారని వెల్లడించారు.

https://twitter.com/BRSHarish/status/1892935476501233692

Read more RELATED
Recommended to you

Exit mobile version