నేటి కాలంలో చాలా మంది అబ్బాయిలు సెక్స్ మోజులో పడి నాశనం అయిపోతున్నారు. అమ్మాయి కనబడితే చాలు అనుభవించాలి అన్న కాంక్షతో రగిలిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని తార్నకలో జరిగిన ఒక సంఘటన ఇందుకు సరైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒకమ్మాయి ఒంటరిగా ఉన్నాడని గ్రహించి శ్రీధర్ అనే ఒక ఆకతాయి కుర్రాడు… ఆమెకు లిఫ్ట్ ఇస్తానని నమ్మించాడు. పాపం ఆ అమ్మాయి అర్జెంటు గా వెళ్లాలేమో ఏమీ ఆలోచించకుండా అతని బైక్ ఎక్కేసింది. కొంచెం దూరం వెళ్ళాక అతని బుద్ది బయటపడింది . అసభ్యంగా మాట్లాడుతూ లొంగదీసుకుని ప్రయత్నం చేశాడు. రూమ్ కు వెళదాం వస్తావా అంటూ భయపెట్టే విధంగా మాటలు ఉండడంతో భయపడిపోయింది ఆ అమ్మాయి తప్పించుకునే ప్రయత్నంలో బైక్ నుండి కిందకు దూకేసింది.
లిఫ్ట్ ఇస్తానని మోసం చేయబోయిన ఆకతాయి… బైక్ పై నుండి దూకేసిన యువతి !
-