BREAKING : కేంద్రమంత్రిగా బండి సంజయ్… ?

-

మరికొద్ది సేపట్లో బీజేపీ అధిష్టానం రాష్ట్రాల వారిగా కీలక పోస్ట్ లను మారుస్తూ ఉత్తర్వులు విడుదల చేయనుంది. కొన్ని రాష్ట్రాలలో ఆయా బాధ్యతలకు నియమించిన వ్యక్తులు సరిగా పనిచేయకపోవడం కారణంగా కొందరిని మారుస్తుంటే… మరికొందరి విషయంలో మాత్రం సంతృప్తి చెంది జాతీయ రాజకీయాలలో మరింత ఉన్నతమైన పదవులను ఇవ్వడానికి మార్పులు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికి తెలుస్తున్న సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను తొలగించనున్నారు. ఈయనకు బదులుగా ఎవరిని ఈ స్థానంలో నియమించనున్నారు అన్న విషయం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉంటే… బండి సంజయ్ కు పదోన్నతిని కల్పిస్తూ కేంద్ర మంత్రిగా తీసుకోనున్నారన్న వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. అయితే ఇది కేవలం సహాయక మంత్రిగా అన్నది క్లియర్ గా తెలుస్తోంది.

కానీ ఏ శాఖలో బండి సంజయ్ ను సహాయ మంత్రిగా తీసుకోనున్నారు తెలియాల్సి ఉంది. ఈ వార్తపై ఎటువంటి వాస్తవం ఉందన్నది తెలియాలంటే ఇంకాసేపు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version