బాల్కనీలో బట్టలు ఆరేస్తే రూ.20 వేల ఫైన్!

-

సాధారణంగా నగరాల్లో ఉండేవారు ఉతికిన దుస్తులను బాల్కనీలో ఆరేస్తుంటారు.ఇందులో వింతేమీ లేకపోయినా ఇక నుంచి అలా చేస్తే రూ 20,000 ఫైన్ కట్టాల్సిందే.ఇలాంటి నిబంధనను ఓ నగరంలో విధించడంతో అక్కడి ప్రజలంతా అవాక్కవుతున్నారు.ఏ మాత్రం నిబంధనలు పట్టించుకోకుండా బట్టలు ఆరేస్తే భారీ జరిమానా తప్పనిసరిగా కట్టాల్సిందే.దీంతో ఉతికిన దుస్తులు ఎక్కడ ఆరేసుకోవాలో తెలియక అక్కడి ప్రజలు అయోమయంలో ఉన్నారు.వివారాల్లోకి వెళితే..అరబ్ దేశాలలో నిబంధనలు కఠినతరంగా ఉంటాయి.హత్య, అత్యాచారం వంటి నేరాల లో అక్కడ ఇప్పటికి మరణ శిక్షలు విధిస్తూ ఉంటారు.రోడ్డుపై పొరపాటున ఉమ్మినా జైలుకు వెళ్లాల్సిందే.

తాజాగా యూఏఈ రాజధాని అబుదాబి మున్సిపాలిటీ ఇటీవల ఓ వింత నిబంధనను విధించింది.ప్రజలు బాల్కనీ లో దుస్తులు ఆరేయకూడదని హెచ్చరించింది.ఒకవేళ నిబంధనను పట్టించుకోకుండా బట్టలు ఆరబెడితే వెయ్యి దిర్హమ్ లు అనగా (రూ.20 వేలు) ఫైన్ కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.బాల్కనీలో దుస్తులు ఆరేయడం వల్ల నగర అందం దెబ్బతింటుంది అనేది అధికారుల వాదన.నేర తీవ్రతను బట్టి అవసరమైతే జైలు శిక్ష కూడా ఉంటుందని అక్కడి అధికారులు పేర్కొన్నారు.దీంతో అబుదాబి ప్రజలకు దిక్కుతోచని స్థితిలో చేసేదేమీ లేక ఇళ్లలోనే దుస్తులు ఆరబెట్టుకున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news