గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం..తెలంగాణ కీలక వ్యాఖ్యలు

-

హైదరాబాద్ జలసౌధ వేదికగా గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ సభ్యులు రాకపోవడంతో సమావేశాన్ని మార్చి 11, ఏప్రిల్ 22 తేదీల్లో వాయిదా వేసిన చైర్మన్ ఎంపీ సింగ్.. నేటి సమావేశంలో.. గెజిట్ నోటిఫికేషన్ అమలు, బోర్డు నిర్వహణ, ప్రాజెక్టుల డీపీఆర్‌లపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ మాట్లాడుతూ.. గోదావరి బోర్డు పదమూడో సమావేశం ముగిసింది..తెలంగాణకు చెందిన చనాకా – కొరాటా ఆనకట్ట, చౌటుపల్లి హన్మంతురెడ్డి, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లపై డిస్కషన్ చేసామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకటనగరం పంప్ హౌస్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల డీపీఆర్‌లపై చర్చించాం..ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ మన సైడ్ నుంచి క్లియర్ గా ఉన్నాయని వెల్లడించారు. ఈ రోజు కూడా ఏపీ ప్రభుత్వం నుంచి అబ్జెక్షన్స్ పెట్టారు..మా సైడ్ నుంచి అన్ని పాత ప్రాజెక్టు లే కాబట్టి అనుమతులు క్లియర్ ఉన్నాయి.. CWC కి కూడా మేము పంపించామని చెప్పారు.

GRMB ఛైర్మెన్ ఏపీ అబ్జెక్షన్స్ రిజెక్ట్ చేసారు.. గెజిట్ నోటిఫికేషన్ పై సబ్ కమిటీ ద్వారా డిటెయిల్ గా స్టడీ చేసి, రిపోర్ట్ చేస్తారని తెలిపారు. మన నీటిని ఏపీ వాడుకుంటుంది..గోదావరి నీటిని పట్టుసీమ ద్వారా కృష్ణా బేసిన్ కు డైవర్ట్ చేస్తుంది.. అందులో భాగంగా తెలంగాణ కు 45 టీఎంసీ ల వాటా రావాలి.. సీలేరు ప్రాజెక్టు లో తెలంగాణ వాటా పై కూడా చర్చించామన్నారు. బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ అన్ని అంశాలను నోట్ చేసుకున్నారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news