కేంద్ర బడ్జెట్‌లో నగరాల అభివృద్ధికి రూ. 1 లక్ష కోట్లతో కొత్తగా ఫండ్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రస్తుతం దేశంలోని మెట్రో నగరాలతో పాటు అభివృద్ధి చెందుతున్న నగరాలను గ్రోత్ హబ్స్‌గా మార్చేందుకు, క్రియేటివ్ రీ డెవలప్ మెంట్‌కు మద్దతించేందుకు రూ.లక్ష కోట్లతో ‘అర్భన్ చాలెంజ్ ఫండ్’ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
తాగునీరు, పారిశుధ్య మౌలిక సదుపాయాలకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఆధారపడతగిన ప్రాజెక్టులకు ఇది 25 శాతం నిధులు ఇస్తుందన్నారు. బాండ్లు, బ్యాంకు లోన్లు, పీపీపీ పద్ధతిలో 50 శాతం నిధి ఏర్పాటు చేస్తామన్నారు. 2025-26కి గాను రూ.10 వేల కోట్లు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.