కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి కొత్త చరిత్రను లిఖించారు.చరిత్రలోనే అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా కేంద్రమంత్రిగా రికార్డును సృష్టించారు.గతంలో కాంగ్రెస్ హయాంలో మొరార్జీ దేశాయ్ 10 సార్లు కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టగా.. నిర్మలమ్మ ఆయనకు చేరువయ్యారు.
ఇక 2019 నుంచి నిర్మలా సీతారామన్ వరుసగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అందులో ఆరు సార్లు రెగ్యులర్ బడ్జెట్, ఒకసారి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రతిసారి సంప్రదాయ చీరకట్టులో ఎరుపు రంగు వస్త్రంలో ఉంచిన కాపీలు/ ట్యాబ్‌తో ఆమె పార్లమెంటుకు రావడం విశేషం. నేడు తెలుపురంగు చీరలో పార్లమెంటుకు వచ్చిన నిర్మలమ్మ ఒక గంటా 15 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపించారు.