ఇండియా పరువు తీస్తున్న ఫోటో…!

ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌ పూర్‌ లో జరిగిన ఒక హృదయవిదారక ఘటన సంచలనంగా మారింది. ఒక వృద్ధుడు మరణించిన తన భార్య మృతదేహాన్ని దహన సంస్కారానికి తీసుకువెళ్ళడానికి గంటల తరబడి సైకిల్‌ పై తీసుకువెళ్ళాడు. విశ్రాంతి తీసుకోవడానికి రోడ్డు పక్కన కూర్చున్న వ్యక్తి ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో మహిళ మృతదేహం కూడా సైకిల్ పక్కనే పడేసి ఉంది.

కరోనా వైరస్ కు భయపడి మహిళ అంత్యక్రియలను జాన్ పూర్‌ లో జరపడానికి స్థానికులు అంగీకరించలేదు. అయితే ఆమెకు కరోనా పాజిటివ్ రాలేదు కూడా. ఆ వృద్ధుడు తన భార్యను సైకిల్‌పై తీసుకెళ్లడానికి నానా కష్టాలు పడుతున్నా సరే అక్కడ ఉన్న ఎవరూ ముందుకు రాలేదు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, జాన్‌పూర్ పోలీసులు మంగళవారం రామ్‌ఘాట్‌లో మహిళకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఫోటో ని చూసిన కొందరు భారత్ పరువు తీసే సంఘటన అంటూ కామెంట్ లు చేస్తున్నారు.