ప్రైవేట్ ఆస్పత్రులకు షాక్ ఇస్తున్న ఏపీ సర్కార్

ప్రైవేట్ ఆస్పత్రుల విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. నిబంధనలకు విరుద్దంగా పని చేస్తున్న ఆస్పత్రులకు సంబంధించి ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు దాడులకు దిగారు. సరైన బిల్లులు లేకుండా నిబంధనలు పాటించకుండా పేపర్ బిల్లులు ఇస్తున్న ఆస్పత్రులను అధికారులు గుర్తించారు. విజిలెన్స్ అధికారుల సోదాల్లో భారీ అక్రమాలు బయటపడ్డాయి.

ఒక్కో పేషెంట్ నుంచి 20 నుంచి 50 వేల వారు వసూలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం చెప్పినా సరే వినకుండా ఇలా వ్యవహరించడంతో అధికారులు కఠిన చర్యలకు దిగే అవకాశం ఉంది. భారీ జరిమానాలు విధించే అవకాశం కూడా ఉండవచ్చు. రికార్డులు మెయింటేన్ చేయడం లేదని కూడా అధికారులు గుర్తించారు. విశాఖ తర్వాత విజయవాడ, గుంటూరులో కూడా దాడులు జరిగే అవకాశం ఉంది.