మూసారాంబాగ్ లోని బేకరీలో భారీ అగ్ని ప్రమాదం..!

-

సాధారణంగా వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటాయి. ఇటీవలే చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లోని మూసారాంబాగ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

హైదరాబాద్ మూసారాంబాగ్ లో ఉన్న ఒక రెడ్ రోజ్ బేకరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు స్థానికులు భయంతో పరుగు తీశారు. మంటలను ఆర్పేందుకు ఐదు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని విజయవంతంగా మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎటువంటి గాయాలు కాలేదు. అయితే, భారీగా ఆస్తి నష్టం జరిగింది అని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version