లడ్డూ వ్యవహారంలో సుప్రీం కీలక నిర్ణయం.. ధార్మిక సంస్థల డిమాండ్ ఇదే..

-

తిరుమల తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వాడారంటూ.. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.. వైసీపీ హయాంలో తిరుమల అపవిత్రం అయిందని ఆయన వ్యాఖ్యానించిన విషయం విధితమే.. ఈ క్రమంలో కల్తీ వ్యవహారంపై నిగ్గు తేల్చాలంటూ టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోర్టును ఆశ్రయించారు..

నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు ఐదుగురితో కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది.. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ను రద్దు చేసి.. సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.. దీనిపై వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఇటు కేంద్ర, అటు రాష్ట్ర ప్రభుత్వాలకు భాగస్వామ్యం కల్పిస్తూ స్వతంత్ర కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ఏర్పాటును వైసీపీ నేతలు స్వాగతించడం విశేషం. పిటిషనర్ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ స్వతంత్ర కమిటీతో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. ఈ కమిటీ ఏర్పాటుతో సగం సంతోషం దక్కిందన్నారు. చంద్రబాబు నాయుడు రాజ్యాంగ పదవిలో ఉంటూ తిరుమల లడ్డూపై ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం దారుణమని.. ఆయన రాజీనామా చెయ్యాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ మంత్రులు, నేతలు కూడా స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు.. హిందువుల మనోభావాలు గాయపడ్డాయని.. తప్పు చేసిన వారికి శిక్ష పడేలా స్వతంత్ర్య దర్యాప్తు సంస్థ నిజాలు నిగ్గు తేల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.. విచారణకు కాలపరిమితిలేకపోవడంతో త్వరితగతిన విచారణ ప్రారంభించాలని మంత్రులు కోరుతున్నారు..

మరోపక్క హిందూ సమాజం కూడా ఈ వ్యవహారంపై త్వరగా నిగ్గు తేల్చాలని.. శ్రీవారి వ్యవహారంలో రాజకీయ జోక్యం లేకుండా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతోంది.. ఆలయాల పరిరక్షణను హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించాలనే డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. హిందూ ఆలయాల్లో అన్యమతస్తుల నియామకాలు రద్దు చెయ్యాలని కూడా వారు కోరుతున్నారు.. ఈ లడ్డూ విచారణ వ్యవహారం ఎప్పటికి తేలుతుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version