తల్లి కోసం బాబా గుడి కట్టించిన కోలీవుడ్ స్టార్ హీరో

-

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. విజయ్ తన తల్లి శోభ కోరిక మేరకు చెన్నైలో సాయిబాబా దేవాలయం కట్టించారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘బాబా మందిరం నిర్మించాలని ఉందని విజయ్ కి ఎన్నోసార్లు చెప్పా. నా ఇష్టాన్ని అర్థం చేసుకుని అతను గుడి కట్టించాడు అని తెలిపారు. ప్రతి గురువారం నేను ఇక్కడికొచ్చి పూజలు చేస్తా. విజయ్ కూడా అప్పుడప్పుడూ వస్తుంటాడు’ అని ఆమె పేర్కొన్నారు.

కాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్‌ “దళపతి 68 “ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. GOAT టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.GOATలో ప్రశాంత్‌, ప్రభుదేవా, లైలా, స్నేహ, మిక్ మోహన్‌, జయరాం,యోగిబాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news