ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మందుపాతర పేల్చి పెను విధ్వంసం సృష్టించారు. ఈ భయానక ఘటనలో అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. కానీ, ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వారి శరీరం అంతా రక్తం ద్రవీస్తున్నట్లు దృశ్యాలు స్పష్టంచేస్తున్నాయి. గాయాలపాలైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఊసూరు బ్లాక్ తర్రెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుండం అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ 153 బెటాలియన్‌కి చెందిన జవాన్లు కూంబింగ్‌కు చేస్తున్నారు.సెర్చింగ్ ఆపరేషన్ చేస్తున్న క్రమంలో మావోయిస్టులు బలగాలను లక్ష్యంగా చేసుకొని మందుపాతర పేల్చారు. దీంతో ఒక ఇన్స్పెక్టర్‌తో సహా ఐదుగురు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. జవాన్లను హెలికాప్టర్‌లో రాయపూర్ హాస్పటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు.