ఏపీలో అంతుచిక్కని వ్యాధి కలకలం..ఆ మూడు నగరాల్లోనే అధికం

-

ఏపీలో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. ‘హ్యాండ్‌ ఫుట్‌ మౌత్’‌ అనే వ్యాధి పిల్లలను తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తోంది. కాక్సీకీ అనే వైరస్‌ ద్వారా నెలల శిశువుల నుంచి ఆరేళ్ల వయసు గల చిన్నారుల వరకు ఎక్కువగా ఈ వ్యాధి వ్యాపిస్తున్నట్లు సమాచారం. చేతులు, కాళ్లు, నోటి మీద పొక్కులు, పుండ్లు, దద్దుర్లు రావడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. గత ఏడాదితో పోలిస్తే ఈ వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, విశాఖ నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో రోజుకు కనీసం 4 కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. అయితే, ఇది ప్రాణాంతక వ్యాధి కాదని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు సూచిస్తున్నారు.ఈ వ్యాధి సోకిన వారిలో చేతులు, కాళ్లు, ముఖం, నోటిలో ర్యాషెస్, పుండ్లు, పొక్కులు రావడంతో పాటు కొందరిలో జ్వరం, జలుబు, గొంతు నొప్పి, నోటిలో మంట ఉంటుంది. ఒకటి, రెండు రోజులకు కురుపులు మోకాళ్లు,మో చేతుల వరకు వ్యాపిస్తాయని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news