హైదరాబాద్‌లో ఫుట్ రెస్టారెంట్స్, హోటల్స్, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నాసిరకంగా ఆహారం తయారుచేయడమే కాకుండా అందులో బొద్దింకలు, పురుగులు, చనిపోయిన ఎలుక, బల్లుల కలేబరాలు వస్తున్నా అలాగే సర్వ్ చేస్తున్నారు. రీసెంట్‌గా మోమోస్ తిని నగరంలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.
తాజాగా నగరంలోని సోమాజిగూడ యశోద ఆసుపత్రి ఎదురుగా గల స్వాతి టిఫిన్స్‌లో రాఘవేంద్ర కుమార్ అనే ఓ వ్యక్తి దోశ ఆర్డర్ చేశాడు. తింటుండగా బొద్దింక ప్రత్యక్షమైంది. వెంటనే ఇదేంటని యాజమాన్యాన్ని ప్రశ్నించినప్పటికీ ఆయనకు నిర్లక్ష్యపు సమాధానం వచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ కస్టమర్ డిమాండ్ చేశాడు. దోశలో బొద్దింక వచ్చిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.