టీఆర్ఎస్ టికెట్ కోసం.. ఆశావాహుడు పెట్రోల్ పోసుకుని మ‌రీ..

-

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి కనిపిస్తోంది. జనవరి 7న నోటిఫికేషన్ విడుదల అయింది. జనవరి 22న పోలింగ్ జరుగుతుంది. ఓటరు జాబితా ఇప్పటికే విడుదలైంది. ఇదిలా ఉంటే.. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. మేడ్చల్‌ నియోజకవర్గం పరిధిలోని మేడ్చల్‌, నాగారం, దమ్మాయిగూడ, బోడుప్పల్‌, పోచంపల్లి, తూంకుంట, ఘట్కేసర్‌, పోచారం మున్సిపాల్టీలతో పాటు ఫీర్జాదిగూడ, జవహర్‌నగర్‌, బోడుప్పల్‌ కార్పొరేషన్లకు చెందిన ఆశావాహులు కొందరు టీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ కోసం మంత్రి మల్లారెడ్డిని కలిసేందుకు బోయినపల్లిలోని ఆయన ఇంటికి చేరుకోగా మరికొందరు ఆశావాహులు మల్లారెడ్డి గార్డెన్‌కు చేరుకుని మంత్రి పిలుపుకోసం ఎదురు చూశారు.

ఈ క్ర‌మంలోనే ఓ ఆశావాహుడు తనకు టికెట్‌ రాదని తెలుసుకుని ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని మ‌రీ హల్‌చల్‌ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి తన ఇంటి వెనక డోర్‌ నుంచి వెళ్లిపోయి మకాం మల్లారెడ్డి గార్డెన్స్‌కు మార్చారు. దీంతో మల్లారెడ్డి గార్డెన్స్‌ ఆశావాహులతో కిటకిటలాడింది. ఒక్కొక్కరిని పిలిచి ఒకవైపు మంత్రి మల్లారెడ్ది, మరొక పక్కన ఆయన అల్లుడు టీఆర్‌ఎస్‌ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి సమావేశమయ్యారు. పోటీదారులు ఎక్కువగా ఉన్నందున సముచిత న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version