సోషల్‌ మీడియాలో భార్య న్యూడ్‌ వీడియో..పిల్లలతో కలిసి భర్త సూసైడ్‌ !

-

ఏపీలోని తూ.గో జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్య వేరే వ్యక్తితో అసభ్యకరంగా ఉన్న వీడియోను సోషల్‌ మీడియాలో చూడటంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. దీంతో తన పిల్లలకు విషం తాగించి… తాను తాగి సుసైడ్‌ కు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఆ కుటుంబంలోని 10 ఏళ్ల బాలుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే..వంగపూడికి చెందిన 30 ఏళ్ల మహిళ ఉపాధి నిమిత్తం కువైట్‌ వెళ్లింది.

ఆమె భర్త గోకవరంలో ఉంటుండగా… వారి ఇద్దరు కుమారులు, కుమార్తె అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటున్నారు. తండ్రి అప్పుడప్పుడు పిల్లలను చూడటానికి వస్తాడు. అయితే.. ఈ మధ్యలో తన భార్య నూడ్‌ వీడియోను సోషల్‌ మీడియా ఆమె భర్త చూశాడు. దీంతో మనస్థాపానికి గురైన.. ఆమె భర్త.. తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి.. తాను ఎలుకల మందు తాగాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే.. వారిలో ఓ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version