గుండె గుబేలు…! బాత్ రూమ్ లో 35 పాము పిల్లలు…!

-

a man in tamilnadu found 35 snakes in his bathroom
a man in tamilnadu found 35 snakes in his bathroom

ఎప్పుడైనా బాత్ రూమ్ లో పాము కనిపిస్తుందేమో అని ఊహించుకున్నారా..? ఒకవేళ కనిపిస్తే ఏం చేస్తారు..? అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35 పాములు కనిపిస్తే..? సాధారణంగా పామును దగ్గరనుండి చూస్తేనే ఉలిక్కిపడతారు మరి కొందరు  అక్కడనుండి పారిపోతారు కానీ తమిళనాడు లో ఓ వ్యక్తికి బాత్ రూమ్ లోకి వెళ్ళగానే 35 పాము పిల్లలు కనిపించాయట..! ఈ ఘటన తమిళనాడు లోని కోయంబత్తూరు లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరు లోని కోవిమేడు లో మనోహరన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతను స్నానం చేద్దాం అని బాత్ రూమ్ లోకి వెళ్ళాడు బాత్ రూమ్ లోకి వెళ్ళగానే అక్కడ పాముల గుంపు కనిపించింది ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 35 పాము పిల్లలు కనిపించాయి మనోహరన్ కు గుండె ఆగినంత పనయ్యింది. ఆ దృశ్యం చూడగానే భయమేసి అక్కడనుండి పరుగులు తీశాడు. వెంటనే పాములు పట్టేవాడిని పిలిపించగా పాములు పట్టేవాడు వాటిని అన్నిటిని పట్టుకున్నాడు వాటిని రాసేల్స్  వైపర్ అంటారని అవి చాలా విషపూరిత పాములు అని చెప్పాడు. మంగళవారం వాటిని దగ్గరలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news