కరోనా కేసుల్లో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్..!

-

తెలంగాణ లో కరోనా విజృంబన అస్సలు తగ్గడం లేదు. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో దీని ప్రభావం అధికంగా ఉంది. కాగా, తాజాగా.. గడచిన 24 గంటల వ్యవధిలో 12 మంది మృత్యువాత పడ్డారు.

17 accused in mandoli jail tested positive with corona

కర్నూలు జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 169కి పెరిగింది. ఇక, కొత్తగా 813 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వారిలో 50 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కాగా, మరో 8 మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారు. మొత్తంగా ఏపీలో కరోనా కేసుల సంఖ్య 13,098కి పెరిగింది. తాజాగా 401 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,908 కాగా, మరో 7,021 మంది చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news