పాఠశాల అన్నా.. పాఠశాలలోని ఉపాధ్యాయులు అన్నా ఒక ప్రత్యేక భావన ఉంటుంది. అయితే.. ఓ వ్యక్తి తన పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో యూనిఫాం ఇవ్వలేదని ఏకంగా కత్తిపట్టుకొని ఆ స్కూల్‌కే వెళ్లాడు. వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రంలోని ఆరారియా జిల్లా.. జోకిహాత్ బ్లాక్‌లోని ఓ పాఠశాలలో విద్యార్థులకు టీచర్లు పాఠాలు బోధిస్తున్నారు. అంతా నిశ్శబ్దంగా ఉంది. అంతలోనే ఓ లుంగీ మాత్రమే ధరించిన వ్యక్తి కత్తితో స్కూల్లో ప్రత్యక్షమయ్యాడు. 24 గంటల్లో డబ్బులివ్వకపోతే చంపేస్తానని ఆ కత్తితో అక్కడున్న టీచర్లను బెదిరింపులకు గురి చేశాడు. అయితే ఆ వ్యక్తి పిల్లలు అదే పాఠశాలలో చదువుతున్నారు. ఆ పిల్లలు బట్టల్లేకుండానే స్కూల్‌కు వెళ్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన యూనిఫాం కూడా రాలేదు.
దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆ పిల్లల తండ్రి కత్తితో స్కూల్లోకి ప్రవేశించి, హల్‌చల్ సృష్టించాడు. తక్షణమే స్కూల్ యూనిఫాం ఇవ్వాలి. లేదంటే 24 గంటల్లో ఆ దుస్తులకు కావాల్సిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అది కూడా జరగని పక్షంలో మళ్లీ వచ్చి కత్తితో పొడిచేస్తానని టీచర్లను బెదిరించాడు సదరు వ్యక్తి. ఇక అక్కడ గుమిగూడిన గ్రామస్తులు ఆ వ్యక్తిని అటు నుంచి పంపించేశారు. ఈ హంగామా సృష్టించిన వ్యక్తిని అక్బర్‌గా పోలీసులు గుర్తించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Araria Dist, Father named Akbar reached his child's school with a sword & threatened teachers just cause his son didn't get money for school uniform.
He has all the rights as Manmohan said "Desh ke sansadhno pe pahle haq mus@lman0 ka hai" They are just claiming in their own way. pic.twitter.com/9M1UNTBrPt
— P!YU$H S (@SpeaksKshatriya) July 8, 2022