‘పొన్నియన్‌ సెల్వన్‌’ టీజర్‌ రిలీజ్‌ చేసిన మహేశ్‌బాబు

-

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొన్నియన్‌ సెల్వన్‌ సినిమా నుంచి బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ భాషలన్నింటిలోను టీజర్ ను రిలీజ్ చేయగా.. తెలుగు టీజర్ ను సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు విడుదల చేశారు.

మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా తెరకెక్కుతుండగా.. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ చారిత్రక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజరాజ చోళ పాలనా కాలంలో ఈ సినిమా సాగుతుంది. విక్రమ్ .. కార్తి .. జయం రవి .. ఐశ్వర్య రాయ్ .. ఐశ్వర్య లక్ష్మి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చాడు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ లో, పోరాట సన్నివేశాలను హైలైట్ చేశారు. అలాగే కథలోని కొన్ని సున్నితమైన అంశాలను డైలాగ్స్ లేకుండా టచ్ చేశారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా కనిపిస్తోంది. ఈ సినిమా మరో సంచలనం సృష్టిస్తుందో చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version