ముంబయి నిర్భయ ఘటన.. మృత్యువుతో పోరాడి ఓడిపోయిన బాధితురాలు

ముంబై లో నిర్భయ తరహా లైంగిక దాడికి గురైన ఓ మహిళా 33 గంటల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి మృతి చెందింది. శనివారం ఉదయం ఆ మహిళ మృతి చెందింది. ఆమెపై పాశవిక లైంగిక దాడి ముంబై లోని సాకినక సబర్బన్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన శుక్రవారం రోజున వెలుగుచూసింది. కొందరు దుర్మార్గులు ఆ మహిళలు బంధించి ఓ టెంపో వాహనం లో లైంగిక దాడి చేశారని సమాచారం అందుతోంది.

అనంతరం ఆమె ప్రైవేట్ భాగాలను లోకి రాడ్లు పంపించినట్లు తెలుస్తోంది. ఆమె అల్లాడుతుంటే… ఆ కామాంధులు లైంగిక దాడి చేశారు. అందరికీ సాయిరాం ని రోడ్డు పక్కన ఆ బాధితురాలిని వదిలిపెట్టి పారిపోయారు ఆ కామాంధులు. ఇంకా రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతున్న మహిళను చూసి ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ మహిళను రాజా వాడి ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో ఇవ్వాళ మృతి చెందింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన మోహన్ చౌహాన్ ను అరెస్టు చేశారు ముంబై పోలీసులు.