షర్మిల మరో కీలక నిర్ణయం : నల్లగొండ జిల్లాలో దళిత భేరీ బహిరంగ సభ

YSR తెలంగాణ పార్టీ నేతృత్వంలో రేపు దళిత భేరీ బహిరంగ సభను నిర్వహించాలని వైఎస్ షర్మిలా నిర్ణయం తీసుకున్నారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని వైఎస్ షర్మిలా నిర్ణయం తీసుకున్నారు. రేపు మధ్యాహ్నం 03 గంటలకు ఈ సభ ప్రారంభం నిర్వహించనున్నారు వైఎస్ షర్మిలా.

ఇక ఈ సమావేశం లో వైఎస్ షర్మిల, ఇతర ముఖ్యనేతలు హాజరుకానున్నారు. దళిత భేరికి రావాల్సిందిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ను ఆహ్వానించారు షర్మిల. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్ర‌తి ఒక్క ద‌ళిత పేద కుటుంబానికి రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాలని… మూడెక‌రాల భూమికి ఎక‌రానికి రూ. 10 ల‌క్ష‌ల చొప్పున దళిత బంధు తో కలిపి 40 ల‌క్ష‌లు ద‌ళితుల‌కు చెల్లించాలని డిమాండ్ చేయన్నారు. ద‌ళితులే ప‌రిపాల‌న చేసుకునే విధంగా ఉండాలంటే ద‌ళిత కాల‌నీల‌ను, ద‌ళిత వాడ‌ల‌ను గ్రామ‌ పంచాయ‌తీలుగా ఏర్పాటు చేయాలని ఈ సభ సందర్భంగా డిమాండ్ చేయనున్నారు.