రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటు పార్టీ పరంగా ప్రక్షాళన ప్రారంభించిన సీఎం, ఇటు పాలనాపరంగా నిర్ణయాలు ప్రారంభించారు. అందులో భాగంగానే సీఎం కార్యాలయం నుంచి సిఎస్ వరకు జిల్లాస్థాయిలోను అధికార వ్యవస్థలో అవసరమైన మార్పులకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి నియామకానికి రంగం సిద్ధమైంది.
అయితే ఏపీ సిఎస్ నియామక కసరత్తులో తెరపైకి కొత్త అంశం వచ్చింది. కొత్తగా సిఎస్ రేసులోకి వచ్చారు గిరిధర్ అర్మనే. నేడు సీఎం జగన్ తో భేటీ అయ్యారు రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అర్మనే. గిరిధర్ ఏపీ క్యాడర్ కు చెందినవారు. ఏపీ క్యాడర్ సీనియారిటీ లిస్టులో రెండవ స్థానంలో ఉన్నారు గిరిధర్. సిఎస్ నియామకపై కసరత్తు జరుగుతున్న సమయంలో సీఎం జగన్ – గిరిధర్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సీఎస్ నియామక కసరత్తులో భాగంగానే ఈ భేటీ జరుగుతుందా? లేక మర్యాదపూర్వక భేటీఆ అంటూ అందరిలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.