హనీమూన్ లో విషాదం.. భార్య కళ్లముందే మరణించిన భర్త..

-

చెన్నైకి చెందిన అరవింద్‌ (27), ప్రీతిలకు గత వారం వివాహం జరిగింది. పెళ్ళైన జంట హనీమూన్ కు వెళ్లాలని అనుకుంటారు. ఇటీవలే హనీమూన్ కోసం ఈ జంట హిమాచల్ ప్రదేశ్ లోని కులు మనాలి వెళ్ళింది. మనాలిలో వారం రోజులపాటు ట్రిప్ ఉండాలని ప్లాన్ చేసుకున్నారు. మనాలిలోని డోబీ ప్రాంతం పారాగ్లైడింగ్ కు ప్రసిద్ధి. ఎక్కువమంది అక్కడ పారాగ్లైడింగ్ చేస్తుంటారు. సాహసంతో కూడుకున్నదే అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటే థ్రిల్లింగ్ కలిగిస్తుంది. అయితే అక్కడ పలువురు ఔత్సాహికులు ప్యారాగ్లైడింగ్‌ చేస్తుంటే చూసిన అరవింద్, టికెట్‌ కొనుగోలు చేసి, ప్యారాగ్లైడర్‌ పైలట్‌ హరూరామ్‌ తో కలిసి విహారానికి వెళ్లాడు.

ప్రీతి కింద నుంచి ఆసక్తిగా చూస్తుంటే, గాల్లో చక్కర్లు కొట్టాడు. ఇంతలో అరవింద్‌ నడుముకు కట్టుకున్న బెల్ట్‌ ఉన్నట్టుండి ఊడిపోగా, కింద ఉన్న పల్లంలో పడిపోయి, తీవ్ర గాయాలపాలై, అక్కడికక్కడే మరణించాడు. హరూరామ్, వేగంగా కిందకు దిగి గాయాల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, అరవింద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భద్రతా బెల్ట్‌ ను సరిగా కట్టుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేశారు. కళ్ళముందే భర్త అలా మరణించడంతో ఆ భార్య కన్నీరుమున్నీరైంది. ఈ సంఘటన ఆమె కుటుంబంలో విషాదం నింపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version