Google Meet‌లో సరికొత్త ఫీచర్.. ఆ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే!

-

గూగుల్ మీట్ కోసం గూగుల్ ఇటీవల సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వినియోగదారుల కోసం ప్రత్యేక ఫీచర్ తీసుకురానుంది. ఈ ఫీచర్ సాయంతో వినియోగదారులు స్పేస్‌బార్‌లో తమకు తాము మ్యూట్, అన్‌మ్యూట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వల్ల వినియోగదారులు గూగుల్ మీట్‌ని ఉపయోగించడం సులభం అవుతుంది.

Google Meet‌

ఐఏఎన్‌ఎస్ నివేదిక ప్రకారం.. ఈ ఫీచర్ రాకతో మీటింగ్‌లో వినియోగదారుల భాగస్వామ్యం మరింత సులభం అవుతుంది. ఎందుకంటే వినియోగదారులు స్పేస్‌బార్‌ను క్లిక్ చేయడం ద్వారా తమను తాము అన్‌మ్యూట్ చేసుకోవచ్చు. అన్‌మ్యూట్ చేసుకోవడం తర్వాత మళ్లీ మ్యూట్ చేయడం తరచూ మర్చిపోవడం జరుగుతుంది.

అలాంటప్పుడు ఈ ఫీచర్ వినియోగదారులకు ఉపయోగపడనుంది. స్పేస్ బార్‌ ఆప్షన్‌ను క్లిక్ చేయడం వల్ల ఈజీగా మ్యూట్ చేసుకోగలుగుతారని గూగుల్ పేర్కొంది. డిఫాల్ట్ గా ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చన్నారు. గూగుల్ మీట్ సెట్టింగ్‌లో ఈ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version