వాట్సప్‌లో కొత్త ఫీచర్‌.. ఇకపై ఫోన్‌ నెంబర్‌ను కూడా ప్రైవసీలో పెట్టొచ్చు..!

-

వాట్సప్‌, ఇన్‌స్టా ఎప్పుడూ అప్‌డేట్‌ అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ఈ అప్‌డేట్‌ ఫీచర్లు మనకు చిరాకు తెప్పిస్తే.. కొన్నిసార్లు చాలా మంచిగా అనిపిస్తాయి. ‘వాట్సాప్ (WhatsApp)’ త్వరలో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్‌తో యూజర్లకు తమ ప్రైవసీ విషయంలో మరింత ప్రయోజనం చేకూరనుంది.

ఇన్ని రోజులు మన ప్రొఫైల్‌ ఫోటను, లాస్‌సీన్‌ను ప్రైవసీలో పట్టుకున్నాం.. ఇకపై ఫోన్‌ నెంబర్‌ను కూడా ప్రైవసీలో పెట్టుకోవచ్చు. ‘ఫోన్ నెంబర్ ప్రైవసీ (phone number privacy)’ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో ఐ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని వాట్సాప్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, వాట్సాప్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తాజాగా వెల్లడించే వీఏబీటాఇన్ఫో (WABetaInfo) వెబ్సైట్ ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ లేటెస్ట్ అప్ డేట్ ఉన్న బీటా యూజర్లకు మాత్రమే ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంది.

వీరికి మాత్రమే ఈ ఫీచర్

ఈ ఫీచర్ వాట్సాప్ కమ్యూనిటీ యూజర్లు మాత్రమే ఉపయోగించగలరు. వాట్సాప్ కమ్యూనిటీలోని యూజర్లు తమ ఫోన్ నెంబర్ తమకు పరిచయం లేని ఇతరులకు తెలియడం ఇష్టం లేకపోతే.. తమ వాట్సాప్ సెట్టింగ్స్‌లో ఈ ‘ఫోన్ నెంబర్ ప్రైవసీ’ ఫీచర్‌ను ఇనేబుల్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకున్నప్పటికీ.. కమ్యూనిటీ అడ్మిన్‌కు, అలాగే, కాంటాక్ట్ ఇప్పటికే తమ ఫోన్‌లో సేవ్ అయి ఉన్నవారికి ఈ ఫోన్ నెంబర్ లేదా ఆ నెంబర్ తో సేవ్ అయి ఉన్న పేరు కనిపిస్తుంది. కమ్యూనిటీలోని ఇతరులకు మాత్రం కనిపించదు. అలాగే, కమ్యూనిటీ అడ్మిన్ కూడా ఈ ఫీచర్‌ను ఇనేబుల్ చేసుకోలేడు. కమ్యూనిటీ అడ్మిన్ నెంబర్ ఆ కమ్యూనిటీలోని అందరు మెంబర్స్‌కు కనిపిస్తుంది.

ఈమధ్యనే వెబ్‌వాట్సప్‌ కూడా కాస్త అప్‌డేట్‌ అయింది. షేరింగ్‌ ఆప్షన్‌ దగ్గర ప్లస్‌ సింబర్‌ పెట్టి ఐకాన్స్‌ మార్చారు. అలాగే ఎమోజీలను రైట్ సైడ్‌ ఇచ్చారు. ఏదో ఒకటి మారుస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇలా ఎందుకు చేశారో అనుకుంటాం మనం.!

Read more RELATED
Recommended to you

Exit mobile version