PUSHPA : బన్నీ ఫాన్స్ గుడ్ న్యూస్.. పుష్ప నుంచి మరో పోస్టర్ రిలీజ్

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు విభాగాలుగా విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్. ఇక ఇప్పటికే ఈ పుష్ప మూవీ నుంచి.. విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్స్ మరియు ఇంట్రడ్యూసింగ్ వీడియోలు మంచి ఆదరణ పొందాయి.

ఇక ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన… దాక్కో దాక్కో మేక అనే సాంగ్ యూట్యూబ్ లో.. రికార్డులను నమోదు చేస్తోంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ వదిలి చిత్రబృందం. ఒకే ఆల్బంలో హీరో బన్నీ అలాగే విలన్ ఫాహద్ ఫసిల్ ఉన్న పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ పోస్టర్… ఈ సినిమా అంచనాలను భారీగా పెంచేసింది. కాగా ఈ సినిమా మొదటి భాగం డిసెంబర్ 17న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news