ఉగాది పండుగ నాడు కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు.ఆదివారం తన ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ..ప్రజలందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ ఏడాది ప్రజలందరికీ సమృద్ధిగా ఆదాయం పెరి సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోడీ పాలనలో దేశం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతుందని వివరించారు. మోడీ చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.
ఇక ఈ ఏడాది రాష్ట్రంలో అవినీతి పెరుగుతుందని, కొత్త వ్యాధి (వైరస్) ప్రబలే చాన్స్ ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనను చూస్తే అవినీతి నిజంగా రాజ్యమేలుతుందని అర్థం అవుతోందన్నారు.బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ‘పింక్ వైరస్’ సోకి తెలంగాణ ప్రజలు నష్టపోయారని, బీజేపీ పోరాటల వలన పింక్ వైరస్ పీడ విరగడైందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో మరో వైరస్ సోకిందని అన్నారు.