ఒమిక్రాన్ నుంచి కోలుకున్న ఏడాదిన్నర చిన్నారి

-

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకిన ఏడాదిన్నర చిన్నారి పూర్తిస్థాయిలో కోలుకోవడంతో హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ చేశారు. అదే వేరియంట్ బారిన పడిన మూడేండ్ల బాలుడికి లక్షణాలు లేవని, అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

ఇటీవల నైజీరియా నుంచి తల్లి, ఇద్దరు కూతుర్లు మహారాష్ట్రలోని పుణె జిల్లా పింప్రి చించ్వాడ్‌కు వచ్చారు. వారికి కొవిడ్ టెస్టు నిర్వహించగా ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆ మహిళ పింప్రి చించ్వాడ్‌లోని తన సోదరుడిని కలువడం కోసం వచ్చింది. నైజీరియా నుంచి వచ్చిన తల్లి, ఇద్దరు కూతుర్లు, ఆ మహిళ సోదరుడు, అతని ఇద్దరు కూతుర్లకు కరోనా వేరియంట్ ఒమిక్రాన్ సోకింది. వారిలో ఏడాదిన్నర చిన్నారి సైతం ఉంది.

మొత్తం ఆరుగురు ఒమిక్రాన్ రోగులలో ఏడాదిన్నర చిన్నారి సహా నలుగురికి పలుమార్లు కొవిడ్ టెస్టు నిర్వహించగా నెగెటివ్ రావడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news