ఏనుగుదాడిలో వ్యక్తి మృతి.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన డిప్యూటీ సీఎం

-

ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి చెందిన ఘటన పై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబానికి ఇచ్చే ఎక్స్ గ్రేషియా పై కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం దాసరిగూడెం గ్రామానికి చెందిన 72 ఏళ్ల సిద్దయ్య ఏనుగుల దాడిలో దుర్మరణం పాలవ్వడం తీవ్ర బాధకరమని పేర్కొన్నారు. 

ఆయన మృతికి సంతాపం వెల్లడిస్తూ కుటుంబ పెద్దను పోగొట్టుకున్న వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.10లక్షల రూపాయలు పరిహారం ఇక ఏనుగులు సంచారాన్ని వాటి కదిలికలను ఎప్పుటికప్పుడు పరిశీలిస్తూ సమీప గ్రామ ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news