జార్ఖండ్ లోని గుమ్లా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యను వేధించాడని స్నేహితుడిని అతి దారుణంగా చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని నది ఒడ్డున పాతిపెట్టాడు. మృతుడి ఫోన్ ద్వారా వివరాలు సేకరిస్తారని బావిలో వేశాడు. మృతుడు సైన్యంలో పని చేసి రిటైర్డ్ అయ్యాడు. ఈ ఘటనపై నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. గుమ్లా జిల్లాలోని రైదీ పోలీస్ స్టేషన్ పరిధిలో రుక్రూమ్ గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే.. రిటైర్డ్ సైనికుడు రంజీత్ తో తనకు ఏళ్ల తరబడి స్నేహం ఉందని నిందితుడు రమేష్ ఓరాన్ చెప్పాడు. అయితే మద్యం మత్తులో రంజీత్ తన భార్యను వేధించాడని ఆరోపించాడు నిందితుడు. అందుకోసం అని అతనిపై పగ తీర్చుకునేందుకు ఓ ప్లాన్ చేసినట్టు తెలిపారు. అతను తన సోదరుడు దయానంద్ ఓరాన్ తో కలిసి రంజీత్ ను చంపాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నాడు. ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఏదో సాకుతో రమేష్ అతనికి ఫోన్ చేసి రమ్మని మద్యం తాగించాడు. మద్యం మత్తులో నిందితుడు రంజీత్ ను పలుగు, కర్రతో కొట్టి హత్య చేశాడు.
హత్య చేసిన తరువాత మృతదేహాన్ని నది ఒడ్డున గొయ్యి తవ్వి పూడ్చి పెట్టాడు. తాము పట్టుబడుతామనే భయంతో నిందితుడు మృతుడి ఫోన్ ను బావిలో పడేశాడు. అంతేకాదు. మృతుడి బైకును అడవిలో దాచి పెట్టాడు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు మృతుడి దుస్తులపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న గుమ్లా జిల్లా ఎస్పీ హర్విందర్ సింగ్ సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.