సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన మాదిగ విశ్వరూప మహాసభకు ప్రధాని మోడీ చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణకు త్వరలోనే కమిటీ వేస్తామని కీలక ప్రకటన చేశారు. ముప్పై ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తున్న పోరాటానికి బీజేపీ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే.. ప్రధాని మోడీ హాజరైన ఈ సభలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని మోడీ ప్రసంగిస్తుండగా.. ఎస్సీ వర్గీకరణ చేయవద్దంటూ ఓ యువతి పోల్ ఎక్కి నిరసన తెలిపింది. మోడీ పాలన వచ్చాక కులాల పేరుతో రెచ్చగొడుతున్నారని.. ఒకే మతాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేసింది.
ముఖ్యంగా యువతి పోల్ ఎక్కడం చూసిన ప్రధాని మోడీ వెంటనే ఆయన ప్రసంగాన్ని ఆపారు. కరెంట్ పోల్ దిగాలని యువతికి సూచించారు. తాను మీ కోసమే వచ్చానని.. నీ బాధను కచ్చితంగా వింటానని యువతికి చెప్పారు. కరెంట్ పోల్ ఎక్కడంతో షార్ట్ సర్క్యూట్ అవుతుందని.. పోల్ దిగాలని మోడీ విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కరెంట్ పోల్ దిగేందుకు యువతి ససేమిరా అనడంతో బలవంతంగా ఆ యువతిని పోలీసులు కరెంట్ పోల్ పై నుంచి