బండి సంజయ్ కి కేంద్రం నుండి ఫోన్ కాల్

-

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం తెలంగాణలో రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. లిక్కర్ స్కామ్ లో సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఉందని ఆరోపిస్తూ నిన్న కవిత ఇంటిదగ్గర బిజెపి కార్యకర్తలు నిరసనకు దిగారు. వారి అక్రమ అరెస్టుకి నిరసనగా దీక్ష చేయాలని నేడు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దీక్షకు దిగిన బండి సంజయ్ ని దీక్ష భగ్నం చేసి అరెస్టు చేశారు పోలీసులు.

మరోవైపు మొహమ్మద్ ప్రవక్త పై రాజాసింగ్ విడుదల చేసిన వివాదాస్పద వీడియో పై పోలీసులు రాజా సింగ్ ని అరెస్టు చేశారు. రాముడిని కించ పరుస్తూ షో చేసిన మునవర్ ఫారూఖీ హైదరాబాద్ కు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన షో జరిపించారని ఆగ్రహిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు రాజా సింగ్. ఈ ఘటనలపై కేంద్రం సీరియస్ అయింది. ఈ విషయంపై కేంద్ర పెద్దలు.. తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ కి ఫోన్ చేసి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర నిగా వర్గాలు ఆరా తీశాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version