ప్రియాంక ఫోకస్…మునుగోడులో కలిసొస్తుందా?

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకునేలా ఉన్నాయి..ఇప్పటివరకు అధిష్టానం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టకపోవడం వల్ల పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బాగా పెరిగాయి. దీని వల్ల పార్టీ మరింత నాశనమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం చర్చనీయాంశమైంది. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి బాటలోనే వెంకటరెడ్డి వెళ్తారా? లేక కాంగ్రెస్ లో కొనసాగుతారా? అనేది క్లారిటీ రావడం లేదు.

పైగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో వెంకటరెడ్డి పాల్గొవడం లేదు..తాజాగా ఢిల్లీలో ప్రియాంక గాంధీ నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలతో సమావేశం జరిగింది…ఈ సమావేశానికి కోమటిరెడ్డి డుమ్మా కొట్టారు…తనని అవమానించిన రేవంత్ తో వేదిక పంచుకోలేనని, అలాగే తనని పి‌సి‌సి నుంచి తప్పిస్తేనే పార్టీ బాగుపడుతుందని  సోనియా గాంధీకి లేఖ రాశారు. అయితే వెంకటరెడ్డి వ్యాఖ్యలని కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకునేలా లేదు.

ఇదే క్రమంలో మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ప్రియాంక గాంధీ..తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెడతారని తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను ఇక నుంచి ప్రియాంక గాంధీ నిశితంగా పర్యవేక్షించనున్నారని మధుయాష్కి చెబుతున్నారు. అలాగే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కూడా ప్రియాంక పాల్గొంటారని తెలుస్తోంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇకపై ప్రియాంక తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని తెలుస్తోంది.

అయితే ఆమె ఎంట్రీతో కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత కుమ్ములాటలు తగ్గిపోయి..పార్టీ గాడిలో పడుతుందో లేదో చూడాలి. అదే  సమయంలో మునుగోడు ఉపఎన్నికలో ఆమె ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీలు భారీ సభలు పెట్టాయి. కాంగ్రెస్ సైతం ప్రియాంక గాంధీతో భారీ సభకు ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తమ సిట్టింగ్ సీటుని కాపాడుకోవాలని కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నిస్తుంది. కానీ మునుగోడులో టీఆర్ఎస్-బీజేపీలు దూకుడుగా ఉన్నాయి…కాంగ్రెస్ నేతలలని లాగేసుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ ఇంకా వీక్ అవుతుంది…,మరి ఈ పరిస్తితులని ప్రియాంక ఏ విధంగా సరిచేసి..మునుగోడులో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version