‘విక్రమ్‌’ నిర్మాణంలో హైదరాబాద్‌!

-

ఇస్రో చేపట్టిన కీలక చంద్రయాన్‌ ప్రాజెక్టులో హైదరాబాద్‌లోని ఒక సంస్థ పాల్గొంది. చంద్రయాన్‌లో
భాగంగా విక్రమ్‌ ల్యాండర్‌ను పంపే క్రమంలో ల్యాండర్‌ ఇంజన్‌ను మండిస్తారు. ఈ సమయంలో మోటారు ట్యూబ్‌ నుంచి విడుదలయ్యే 600 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకునేందుకు సిలికాన్‌ ఫ్యాబ్రిక్‌ను ఏర్పాటు చేశారు.

ల్యాండర్‌ మోటార్ల బయట థర్మల్‌ ప్రొటెక్షన్‌ ఇచ్చే ఈ ఫ్యాబ్రిక్‌ను ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలోని ఏరోస్పేస్‌ సంస్థ తయారుచేసింది. వాలెత్‌ ఏరోస్పేస్‌ సంస్థ దేశ వ్యాప్తంగా రక్షణ, ఏవియేషన్‌ రంగాల్లో అనేక ప్రాజెక్టులకు సంబంధించిన పరికరాలను తయారుచేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ఇస్రో, నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబ్‌, విక్రమ్‌ సారాబాయి స్పేస్‌ సెంటర్‌, బీడీఎల్‌, డీఆర్‌డీఎల్‌, తదితర సంస్థలకు తమ పరికరాలను సరఫరా చేస్తున్నట్లు వాలెత్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నితిన్‌ పి.వాలెత్‌ తెలిపారు.

అంతేకాదండోయ్‌ ఇంకా చాలా కీలక విభాగాల్లో మన హైదరాబాద్‌ శాస్త్రవేత్తలు ఉన్నట్లు సమాచారం.
ఏది ఏమైనా మన శాస్త్రవేత్తలు సాధించిన ఈ విజయం తక్కువేమి కాదు. అతి తక్కువ ఖర్చుతో చంద్రుడికి కేవలం 2.1 కి.మీ దాకా వెళ్లడం అంటే నిజంగా భారతీయ సైంటిస్టులకు హ్యాట్యాప్‌.

Read more RELATED
Recommended to you

Latest news