వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి వెళ్ళిన తెలంగాణా మంత్రి కేటీఆర్ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. “కీపింగ్ పేస్ టెక్నాలజీ- టెక్నాలజీ గవర్ననెన్స్ ఏట్ క్రాస్ రోడ్స్” పేరుతో జరిగిన ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. వాస్తవానికి ఈ సమావేశానికి కేవలం ప్రభుత్వాధినేతలు, కేంద్ర ప్రభుత్వాల్లో ప్రభుత్వ పాలసీ నిర్ణయించే సీనియర్ మంత్రులు మాత్రమే హాజరు అవుతారు.
కాని రాష్ట్ర స్థాయి ఆహ్వానితుల్లో ఈ సమావేశానికి హాజరైన లీడర్ కేటీఆర్. మంత్రి కేటిఆర్ కు ఈ సమావేశం కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రత్యేక బ్యాడ్జ్‌ను కూడా అందించింది. గ్యాదరింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ లీడర్స్ సమావేశానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రత్యేక ఆహ్వానం పంపింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్ళిన మంత్రి కేటిఆర్, తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు గాను విశేషంగా,
కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. పరిశ్రమల కోసం తెలంగాణా ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు, హైదరాబాద్ నగరానికి ఉన్న అవకాశాలు వంటివి ఆయన వివరిస్తూ పలు కీలక కంపెనీలను ఏ విధంగా అయినా సరే తెలంగాణాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు గాను ఒప్పందం కూడా చేసుకున్నాయి.